కురువలకు టిక్కెట్లు ఇవ్వని వైసీపీ పార్టీని ఓడిస్తాం
1 min readకురువ,మదాసి కురువ/మదారి కురువ పొలిటికల్ జేఏసీ హెచ్చరిక.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో కురువ,మదాసికురువ/మదారి కురువ సామాజిక వర్గానికి టికెట్లను కేటాయించని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ఓడిస్తామని కురువ, మదాసి కురువ/మదారి కురువ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రవికుమార్ అన్నారు.కర్నూలు నగరంలోని స్థానిక బీసీ భవన్ లో జేఏసీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వైస్ చైర్మన్లు కురువ బలరాం,కురువ మహేంద్ర,మదాసికురువ తిరుమలేష్,మదాసి కురువ శివలింగం,మదాసి కురువ సుంకన్న,మదాసికురువ శివయ్య మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14నియోజక వర్గాలలో 6లక్షల ఓటర్లు కలిగి జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గాలలో ఒకటైన కురువ, మదాసి కురువ/మదారి కురువ సామాజిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చిన అభ్యర్థుల లిస్టులలో ఏ నియోజకవర్గంలో కూడా తమ సామాజిక వర్గానికి టికెట్లను కేటాయించకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.నా ఎస్సీలు,నా బీసీలు అని చెప్పుకునే పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వెనుకబడిన కురువ సామాజిక వర్గాన్ని ఆదుకోవలసిందిపోయి,తీవ్ర అన్యాయానికి,నిర్లక్ష్యానికి గురిచేసారని ఆవేదన వ్యక్తంచేశారు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరులో 65వేల ఓటర్లు,ఆదోనిలో 45వేల ఓటర్లు,ఎమ్మిగనూరులో 40వేల ఓటర్లు,పత్తికొండలో 70వేల ఓటర్లు, మంత్రాలయం,కోడుమూరు కర్నూలు నియోజకవర్గాల్లో 30నుండి 55వేల ఓటర్లు, నంద్యాల జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 20వేల నుండి 40వేల కురువ మదాసి కురువ మదారి కురువ ఓటర్లు ఉన్నాకూడా కురువ, మదాసి కురువ/మదారి కురువ సామాజిక వర్గాన్ని రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.జిల్లావ్యాప్తంగా వున్న కురువ సామాజిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని గ్రామ గ్రామాన మా కురువ, మదాసి కురువ/మదారి కురువ కులజులకు తెలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టిని ఓడిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కురువ సంఘాల నాయకులు మురళి,సుధాకర్, మద్దిలేటి,రాజు తదితరులు పాల్గొన్నారు.