‘కొండపేట ఫారెస్ట్’ను అభివృద్ధి చేస్తాం: డీఎఫ్ఓ
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు: కమలాపురం శాసన సభ్యులు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి కొండపేట గ్రామ పంచాయితీ నందు గల పారెస్ట్ పొలంలోని భూమి అదేవిధంగా శిథిలమైన బంగాళాలనుగుర్తించి రాష్ట్ర పారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ యర్రసాని మధుసుధన్ రెడ్డి కి ఈ విషయాన్ని తెలిజేయడం జరిగింది,ఆయన వెంటనే స్పందించి ప్రొద్దటూరు DFO నాగార్జున రెడ్డికి ఈ విషయమై చర్చించి మండలంలోని కొండపేటకు ఆదివారం సాయంత్రం పంపించడం జరిగింది ,వారు కొండపేట గ్రామం నందు పారెస్ట్ పొలాన్ని అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఫారెస్ట్ బంగ్లా లను పరిశీలిచడం జరిగింది,అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో దీనికి కావాల్సిన నిధులు సేకరించి మండల ప్రజలకు ఉపయెగపడేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చీర్ల సురేష్ యాదవ్ ,యర్రసాని మోహన్ రెడ్డి ,కొండపేట ఎంపీటీసీ దుంప నాగిరెడ్డి ,పి.సి.కేశవ రెడ్డి ,నాగిరెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.