వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తా
1 min read
వైయస్ఆర్సీపీ రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శి దాదిరెడ్డి భాగ్యమ్మ
చెన్నూరు, న్యూస్ నేడు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలపై రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు , దాడులు, హింసకాండ పై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి దాదిరెడ్డి భాగ్యమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం విలేకరులతో దూరవాణిలో మాట్లాడుతూ, మంగళవారం విజయవాడ లోని తాడేపల్లి లో జరిగిన రాష్ట్రస్థాయి మహిళా విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు రాజీలేని పోరాటం చేస్తామని ఆమె తెలిపారు, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మహిళల పక్షాన పోరాటం సాగిస్తామని ఆమె అన్నారు. గ్రామ గ్రామానికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వంటి వాటిని వివరించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ లో జరిగిన సంక్షేమ పథకాలు, తెలుగుదేశం పార్టీ లో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను, మహిళలకు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పి అమలు చేయలేదో, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేవని నేడు చంద్రబాబు నాయుడు పాలనలో వారి కార్యకర్తలకు, వారి అనుకూల వారికి మాత్రమే పథకాలు అమలవుతున్నాయని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టి, బి సి, మైనార్టీ లకు ఇచ్చే సబ్సిడీ రుణాలు కూడా టిడిపి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ఇలాగైతే పేద ప్రజల పరిస్థితి ఏంటని ఆమె టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టిడిపి ప్రభుత్వం విఫలమైందని ఆమె పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి ప్రజలలోకి వెళ్లి అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని వ సాధ కబాధలు తెలుసుకొని అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడమే కాకుండా 2029 లో మళ్లీ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.