NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం …కర్నూలు ఆర్డిఓ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ముచ్చుమర్రి నుండి ఓర్వకల్ వరకు పరిశ్రమల నిమిత్తమైఏ పీ ఐ ఐ సి వాటర్ పైప్ లైన్ వేస్తున్నాము.ఇందుకు మన కర్నూలు జిల్లాలో సంబంధించి మూడు గ్రామాలలో ఈ పైప్ లైన్ వెళ్తుంది.కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో కర్నూలు మండలం లోని గార్గేయ పురం గ్రామం, ఓర్వకల్ మండలం లో కేతవరం గ్రామం, పూడి చెర్ల గ్రామాలలో ఈ పైపులైను వెళ్లనుంది. వాటర్ పైప్ లైన్ ఎవరి పొలాల్లో అయితే వెళ్తుందో ఆ రైతులను పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది.ఈ మీటింగ్ లో రైతులు తమ సమస్యలను తెలియజేశారు. వారు తెలియజేసిన సమస్యలను జాయింట్ కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళనున్నాము . ఈ సమావేశంలో భూసేకరణకు సంబంధించి రైతులు నష్టపరిహారం విషయమై మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు రెవెన్యూ డివిజన్ అధికారి ఏపీ ఐ ఐ సి జోనల్ మేనేజర్ కర్నూలు తహసిల్దార్ రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *