బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం… ఆర్ జె సి
1 min read
మహానంది, న్యూస్ నేడు: నాగనంది సధనం కూల్చివేతలో జరిగిన ప్రమాద ఘటన లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమీషనర్ చంద్రశేఖర ఆజాద్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం ప్రమాద వశాత్తు జరిగిన ప్రమాద ఘటనపై విచారణ కోసం బుదవారం మహానందికి వచ్చారు. ముందుగా శ్రీకామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం నాగనంది వసతి గృహాల వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటన పై ఈఓ శ్రీనివాసరెడ్డి,ఏ ఈఓ మధు, ఏ ఈ శ్రీనివాసులుతో సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ తో పాటు బాధితుల నిర్లక్ష్యం ఉందని తెలిపారు.ఏదైమైన ఆలయ పరిసరాలలో జరగడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు దేవస్థానం తరపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున, కాంట్రాక్టర్ లక్ష రూపాయల చొప్పున చెల్లించేవిదంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.