PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమరుల త్యాగస్పూర్తితో జిల్లా సమగ్రాభివృద్ది కై పోరాడుతాం

1 min read

– కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి ,షడ్రక్ గార్లకు ఘన నివాళులు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తమ జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి అసువులు బాసిన త్యాగదనులైన పత్తికొండ మాజీ శాసనసభ్యులు ఈశ్వర్ రెడ్డి  అదేవిధంగా  సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి షడ్రక్ గారి స్ఫూర్తితో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు సాగు తాగునీరు మౌలిక సదుపాయాల కోసం పోరాడుతామని సిపిఎం జిల్లా నాయకులు బి వీర శేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు స్థానిక సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి గారి 44 వర్ధంతి అదే విధంగా షడ్రక్  మూడో వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరుల చిత్రపటాలకు సిపిఎం నాయకులు యూసుఫ్ బాషా,బండ్లయ్యలు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరశేఖర్ మాట్లాడుతూ, ప్రజాసేవకే తమ జీవితాల్ని త్యాగం చేసిన ఈశ్వర్ రెడ్డి , షడ్రక్ గార్ల స్ఫూర్తితో మన ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుదాం అని ప్రతిన పూనారు. దివంగత కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి గారు, షడ్రక్ గారు పేదలకు భూమి, ఇల్లు, ఇళ్ల స్థలాల కోసం వీరోచిత పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిన చరిత్ర వారిదని అన్నారు. అట్టడుగు వర్గాలైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై నిరంతరం శ్రమిస్తూ భూస్వామ్య, పెత్తందారి వ్యవస్థ పై  పోరాటాలు జరిపి సమ సమాజ స్థాపనకై  తమ వంతుగా తీవ్రమైన కృషి చేసిన వారికి పోరాటాల ద్వారానే నివాళులు అర్పించాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం రైతుల అభ్యున్నతి కోసం నికరంగా పోరాటమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా సమగ్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల సాధన, అదేవిధంగా దేవనకొండ మండలంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలని పద్ధతుల్లో సిపిఎం పార్టీ ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని ఆయన కోరారు. అనేక వనరులు అవకాశాలు ఉన్న పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి నిరాదరణతో నిత్యం మండలం కరువు కాటకాలకు గురవుతుందని అన్నారు. సాగునీరు రావడమే కరువుకు ఏకైక పరిష్కారం మార్గమని తెలిపారు. సాగునీటి సాధన కోసం సిపిఎం పార్టీ చేసే ఉద్యమాల్లో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగన్న,రాముడు,రాయుడు,రంగడు,సుధాకర్, బలరాముడు, తిమ్మప్ప, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Author