నందికొట్కూరు లో టీడీపీ జెండా ఎగురవేస్తాం.
1 min readనారా భువనేశ్వరి ని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు నాగముని. |
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.నాగముని బుధవారం రాజమండ్రిలోని నారా భువనేశ్వరి ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జి.నాగముని ఆమెకు ధైర్యం చెబుతూ, చంద్రబాబు త్వరగా విడుదల అవుతారని సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గ పరిస్థితుల గురించి తెలియజేస్తూ నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో మద్దతు ఎక్కువైందన్నారు. గత 20 సంవత్సరాలుగా నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయలేదు, కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సహకారంతో, టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర. శివానందరెడ్డి, జిల్లా నాయకులు గౌరు వెంకటరెడ్డి ల ఆధ్వర్యంలో కచ్చితంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ నాయకులు, లీగల్ సెల్ న్యాయవాదులు నారా భువనేశ్వరి కి సంఘీభావం తెలియజేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును, మాజీ ఉప ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల.చిన్న రాజప్పను, మరియు టీడీపీ సీనియర్ నాయకులు వి.వి.చౌదరి, బుచ్చయ్య చౌదరి, లను కూడా నాగముని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, నాయకులు ఆదిరెడ్డి వాసు,న్యాయవాదులు శారద, ప్రసాద్, నమో.సత్యనారాయణ, మరి కొంతమంది న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.