NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తొలకరి నాటికి అన్నదాత సుఖీభవ అమలు చేస్తాం

1 min read

జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి

ప్రతి రైతుకు రూ.20వేలు పెట్టుబడి సాయంగా అందిస్తాం

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ వెల్లడి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు   : దెందులూరు మండలం లోని పోతునూరు, కొవ్వలి గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి తో కలిసి రైతులకు పవర్ ట్రిలర్లు అందించడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  కూటమి ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని,  జూన్లో వచ్చే తొలకరి నాటికి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ప్రభుత్వ పెట్టుబడి సాయంగా 20 వేల రూపాయలను అందించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.దెందులూరు మండలం పోతునూరు కొవ్వలి గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్సిడీ ద్వారా రైతులకు మంజూరైన పవర్ టెల్లర్లను జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డితో కలిసి రైతులకు అందించారు. అనంతరం పోతునూరు, కొవ్వలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “గతంలో ఇదే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు తీర్చాలంటూ తాము ధర్నాలు సైతం కొనసాగించామని, వైసిపి ప్రభుత్వం హయాంలో రైతులు ఎంతో ఆందోళన చెందే వారిని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అంతా కూడా ఎంతో నిశ్చింతగా ఉన్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించిన 24 గంటల్లోగా రైతుల ఎకౌంట్లో డబ్బులు జమ అయ్యేలాగా చేస్తూ కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా నిలుస్తుందని తెలిపారు. అదేవిధంగా జూన్ నుంచి అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ పథకానికి కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలాగా కౌలు రైతుల వివరాలను కూడా పూర్తిస్థాయిలో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అయితే గ్రామాల్లో ఉన్న చిన్నా సన్నకారు కౌలు రైతుల వివరాలు కూడా నమోదయ్యే విధానం అంశంలో స్థానిక కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా ప్రత్యేక చొరవ చూపించాలి అని, ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి ప్రతి ఒక్క రైతుకి కూడా చేరినప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక చొరవ చూపి కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  సూచించారు. అదేవిధంగా గోదావరి ఆయకట్టుకు చివరన ఉన్నా కూడా దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో గతం కన్నా అత్యధికంగా ఎకరాకు 60 బస్తాలు ధాన్యం పండించడం జరిగిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గతంలో ఎకరాకు నిర్ణీత బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొంటామంటూ గత ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెట్టాయని, అయితే ఈసారి కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారు ఎకరాకు ఎంత పండించినా కూడా ఆఖరి ధాన్యం గింజ వరకు కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పలువురు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక సచివాలయాల సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *