PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… జిల్లా ఎస్పీ

1 min read

స్పందన కార్యక్రమానికి 77  ఫిర్యాదులు .

స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్   సోమవారం  స్పందన కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ  మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 77  ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …

1)           ఫేస్ బుక్ చూస్తుంటే , రవికుమార్ అనే పేరుతో ఉన్న పేస్ బుక్ ఖాతా నుండి మిలాన్ డే గురించి లింకు పంపినాడు. ఆ లింక్ ను లైక్ చేసి క్లిక్ చేయడం జరిగింది. నాకు ఫోన్ చేసి వాట్సప్ కు హాయ్ అని చెప్పాడు.   రూ. 550 మెంబర్ షిప్ చలనా చార్జీలు అని,  డబ్బులు  వేస్తే లక్కీడ్రా వస్తుందని రూ. 2 వేలు వేయించుకున్నాడు. లక్కీడ్రా క్రింద మొత్తం రూ. 2 లక్షల 5 వేలు వచ్చాయని చెప్పి 10 శాతం కమిషన్ క్రింద రూ. 20 వేలు  కట్టించుకున్నాడు. నా బ్యాంకు ఖాతా కు మొత్తం వేస్తామని చెప్పి,  కొత్త బ్యాంకు ఖాతా అని, UP ID పని చేస్త లేదని, సర్వర్ బిజి ఉందని, సర్వీస్ చార్జీలు అని  వివిధ కారణాలతో  మొత్తం రూ. 70 వేలు నసీర్ అనే పేరు గల ఫోన్ పే కు  వేయించుకుని తెలియని వ్యక్తులు మోసం చేశారని వెల్దుర్తి మండలం, రామళ్ళకోట గ్రామానికి చెందిన ఖలీల్ భాష  ఫిర్యాదు చేశారు. 2)    సీడ్ పత్తి విత్తనాలు మరియు దూది పత్తి కలిపి మొత్తం 15 క్వింటాళ్లు మా నుండి కోనుగోలు చేసి వారంలోపు డబ్బులు ఇస్తామని చెప్పి  ఇవ్వకుండా మోసం చేసిన మహబూబ్ నగర్ జిల్లా, అయిజ మండలం కు చెందిన శివశెట్టి మరియు ఏజెంట్ జాల మంచి ఈడిగ నారాయణ ల పై చర్యలు తీసుకోవాలని కోసిగి మండలం,  దొడ్డి బెళగల్ కు చెందిన రైతులు బి. నాగేంద్ర, హనుమంతు, తిక్కస్వామి, చంద్రన్నలు ఫిర్యాదు చేశారు.3)         టెలిగ్రాం యాప్ లో కమిషన్ బేసిస్ లో డబ్బులు ఇస్తామని ఆశ చూపించి ZOMATO పేరుతో పార్ట్ టైం ఉద్యోగాలు ఉన్నాయని , ఆన్ లైన్ లింకులు పంపి, వేర్వేరు సుమారు 10 బ్యాంకు ఖాతాలలో రూ. 7 లక్షలు వేయించుకుని  మోసం  చేశారని ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలంటే ఇంకా 50 శాతం డిపాజిట్ చేయాలని చెబుతూ మోసం చేస్తున్నారని కర్నూలుకు చెందిన  షాషావలి   ఫిర్యాదు చేశారు.4)              సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి,  హైదరాబాద్ ITC INFOTECH పేరుతో ఫేక్ కాల్ లెటర్ ఇచ్చి రూ. 2 లక్షల 85 వేలు తీసుకొని కర్నూలుకు చెందిన సాయికిరణ్ మోసం చేశారని, డబ్బులు తిరిగి ఇవ్వకుండా దుర్భాషలాడుతున్నాడని కర్నూలు, ముజఫర్ నగర్ చెందిన సంతోష్ కుమార్  ఫిర్యాదు చేశారు.స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్   హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు,  లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు  మరియు సిఐలు  పాల్గొన్నారు.

About Author