NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం …

1 min read

కర్నూలు జిల్లా ఎస్పీ   విక్రాంత్ పాటిల్  ఐపియస్

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమానికి  94 ఫిర్యాదులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ  మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని … క్రిష్ణ వర్ష పొదుపు సంఘంలో రూ. 8 లక్షలు తీసుకొన్నాము.  ప్రతి నెల కంతులు కట్టించుకున్నారు.  పొదుపు సంఘంలోని లీడర్లైన సభ్యులు బ్యాంకు కు డబ్బులు కట్టకుండా మోసం చేశారని బ్యాంకు నుండి నోటిసులు వచ్చాయని కర్నూలు, నిర్మల్ నగర్ కు చెందిన పల్లవి, రషీద, విజయలక్ష్మీ మరియు ఇతర సభ్యలు ఫిర్యాదు చేశారు. నా పెద్ద కుమారుడు  ఇల్లురాసి ఇవ్వాలని, ఇంటి, కుళాయి పన్నులు కట్టకుండా ఇంటి పట్టాలు తీసుకెళ్ళి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు, కోత్తపేటకు చెందిన సుంకులమ్మ ఫిర్యాదు చేశారు. పట్టాబిరామయ్య కుటుంబఅవసరాల కోసం డబ్బులు తీసుకోని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు , సంతోషనగర్ కు చెందిన రహీంబీ    ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ   విక్రాంత్ పాటిల్ ఐపియస్  హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, సిఐలు  పాల్గొన్నారు.

About Author