NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం…

1 min read

కర్నూలు జిల్లా ఎస్పీ   విక్రాంత్ పాటిల్  ఐపియస్.

కర్నూలు , న్యూస్​ నేడు:  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమానికి 102   ఫిర్యాదులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ  మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 102 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …

1)         వాట్సాప్  లో తెలియని వ్యక్తులు లింక్ పంపారు. లింక్ ను క్లిక్ చేసిన తర్వాత  స్టాక్ ఇన్విస్టిమెంట్ అని, బ్లాక్ ట్రేడింగ్ అని, IPO  సబ్ స్క్రిప్సన్ వంటి వాటితో నమ్మించి  పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి రూ. 42 లక్షలు కట్టించుకుని  డబల్ చేసి రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పి సైబర్ నేరగాళ్ళు మోసం చేశారని కర్నూలు, బి.క్యాంపుకు చెందిన ఒక బాధితురాలు ఫిర్యాదు చేశారు. నా చిన్న కుమార్తె  మరియు  పెద్ద కుమార్తె , అల్లుడు ఆస్తి కోసం , పెన్షన్ కొరకు చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు, గఫూర్ నగర్ కు చెందిన ఎస్. సుబ్బారావు  ఫిర్యాదు చేశారు.30 గొర్రెలు దొంగతనం చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని సి. బెళగల్ మండలం, పొలుకల్లు గ్రామానికి చెందిన పలుదొడ్డి జమ్మన్న ఫిర్యాదు చేశారు.ఇంటికి రస్తా ఇవ్వకుండా ఇంటిని నిర్మిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పులికొండ గ్రామానికి చెందిన పత్తికొండ మండలం కు చెందిన బోయ లక్ష్మీ       ఫిర్యాదు చేశారు. ఇంటి ప్రక్కన కొందరు వ్యక్తులు కలిసి స్ధలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని నందవరం మండలం, నందవరం గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు. అమడ గుంట్లగ్రామంలోని 6 ఎకరాల పొలాన్ని దస్తగిరి అనే వ్యక్తి కౌలుకు తీసుకొని కౌలు డబ్బులు ఇవ్వడం లేదని కర్నూలు , వెంకటరమణ కాలనీకి చెందిన ప్రభావతమ్మఫిర్యాదు చేశారు. కుమారుడు కనిపించడం లేదని ఎమ్మిగనూరు మండలం, కందనాతి గ్రామానికి చెందిన లక్ష్మీ దేవి ఫిర్యాదు చేశారు. ఇంటి వెనకాల ఉన్న 4 దోను పైపులు పగులకొట్టిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని మద్దికెర మండలంకు చెందిన టైలర్ గిడ్డయ్య ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా,  సీఐ శ్రీనివాస నాయక్  పాల్గొన్నారు.

About Author