విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… జిల్లా ఎస్పీ
1 min readస్పందన కార్యక్రమానికి 110 ఫిర్యాదులు.
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈరోజు మొత్తం 110 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1)కుమారులు అన్నం పెట్టడం లేదని ఇల్లు, పొలాలు , బర్రెలు తీసుకుని మాకు ఏమి లేకుండా చేసి అనాథలుగా చేశారని న్యాయం చేయాలని తుగ్గలికి చెందిన చిన్న ఆంజనేయ ఫిర్యాదు చేశారు.
2) ఎల్ అండ్ టి కంపెనీలో సూపర్ వైజర్ ఊద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని కర్నూలు బాలజీ నగర్ కు చెందిన రమేష్ ఫిర్యాదు చేశారు.
3) కార్ జజార్ మరియు కారు సర్వీస్ పాయింట్ వ్యాపారంలో పెట్టు బడి పెట్టించి మోసం చేశారని కర్నూలు కు చెందిన అబ్దుల్ వసిమ్ ఫిర్యాదు చేశారు.
4) కర్నూలు బుధవార పేట లో మా స్ధలం ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆదోనికి చెందిన సుజాత ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ గారు హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్ పాల్గొన్నారు.