విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ
1 min read– స్పందన కార్యక్రమానికి 98 ఫిర్యాదులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీజిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 98 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) ఫిజికల్ టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోని మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం, బనవనూరు గ్రామానికి చెందిన మహేష్ ఫిర్యాదు చేశారు.
2) నకిలి డ్యాక్యుమెంట్లు సృష్టించి కర్నూలులో ప్లాట్ అమ్ముతామని చెప్పి అగ్రిమెంట్ క్రింద డబ్బులు తీసుకోని మోసం చేశారని బేతం చేర్లకు చెందిన క్రిష్ణమోహన్ ఫిర్యాదు చేశారు. 3) వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకోని మోసం చేశాడని కర్నూలు కు చెందిన రవి కుమార్ ఫిర్యాదు చేశారు. 4) కుమారుడు నా ఇంటిని నాదే అంటూ, ఇంటి నుండి బయటకు పంపించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు కు చెందిన జక్కల నాగభూషణం ఫిర్యాదు చేశారు. 5) స్థలం ఆక్రమించుకోవాలని ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని కర్నూలు , ముజఫర్ నగర్ కు చెందిన ఓబులమ్మ ఫిర్యాదు చేశారు.6) కెనడియన్ సోలార్ ఆన్ లైన్ యాప్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ మొత్తంలో తిరిగి డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని కర్నూలు, బుధవార పేటకు చెందిన అర్ఫత్ ఫిర్యాదు చేశారు.7) నా ఎస్ బి ఐ ఖాతా నుండి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 3 లక్షలు డ్రా చేశారని చర్యలు తీసుకోవాలని కోసిగి మండలం, సజ్జల గుడ్డం గ్రామానికి చెందిన జీలు రుద్రమ్మ ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీ యుగంధర్ బాబు , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐలు పాల్గొన్నారు.