PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా ప్రభుత్వం వస్తే అంగళ్ల అద్దెలు నియంత్రణలో ఉంచుతాం

1 min read

– టిడిపి నేత టి.జి భరత్

– కొత్తపేట రైతు బజార్ ను సందర్శించిన టి.జి భరత్

– అద్దెలు ఎక్కువగా ఉన్నాయంటూ వాపోయిన కూరగాయల అంగళ్ల మహిళలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రైతు బజార్లో అంగళ్ల అద్దెలు నియంత్రణలో ఉంచుతామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని కొత్తపేట రైతు బజార్ ను టి.జి భరత్ సందర్శించారు. అక్కడ కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు వారి సమస్యలను టి.జి భరత్ తో చెప్పుకున్నారు. ప్రతి రోజూ రైతు బజార్ అధికారులకు తాము రుసుము చెల్లిస్తున్నామని.. అయితే చెల్లించాల్సిన రుసుము కంటే ఎక్కువగా చెల్లించాలని ఇప్పుడు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వారు టి.జి భరత్ తో ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు ఒక సారి రుసుములు పెంచుకుంటూ పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా టి.జి భరత్  రైతు బజార్ ఎస్టేట్ అధికారిణితో ఫోన్లో మాట్లాడి అధిక ధరలు వసూలు చేయడంపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం ఎంత మేర వసూలు చేయాలన్న దానిపై ఆర్డప్ కాపీ తమకు అందజేయాలని కోరారు. ధరలు పెంచడంతో అంగళ్ల నిర్వాహకులపై పడుతున్న భారం గురించి ఆమె ద్రుష్టికి తీసుకెళ్లారు. అనంతరం టి.జి భరత్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయ్యాక రైతు బజార్లో ఎక్కువ రుసుము వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మణి శంకర్ నాయుడు, దశరథ రామ నాయుడు, నరసింహులు, గణేష్, పాల్ రాజ్, ప్రసాద రావ్, పద్మావతమ్మ, శ్రీను, విశ్వనాథ్, శివ కుమార్, మోతిలాల్, సర్దార్, చాంద్, బషీర్, భాస్కర్, మణి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

About Author