మాకు స్టీల్ ప్లాంట్ లు ఉన్నాయని రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా..
1 min readఏలూరు వైసిపి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్
పదవుల కన్నా ,ప్రజాలఆదరణ మా కుటుంబానికి ముఖ్యం..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేయాలో చెప్పండి, వ్యక్తిగతంగా బురద జల్లి అవమానాల పాలవ్వద్దు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజవర్గంలో జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నా తండ్రి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పై, నా పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారని ఏలూరు వైసిపి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. గురువారం స్థానిక గ్రీన్ సిటీ సునీల్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్ముంటే చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని నాకు హైదరాబాదులో స్టీల్ ప్లాంట్ లు ఉన్నాయని రుజువు చేసి చూపించండి నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. ఒకవేళ మీరు కనుక అది ఋజువు చేయలేకపోతే మీరు రాజకీయాల్లో తప్పుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. తణుకులో జనసేన అభ్యర్థిగా విడువాడ రామచంద్రాన్ని ప్రకటించి మళ్లీ టిడిపి అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. మరి విడివాడ రామచంద్రాన్ని తడి గుడ్డతో గొంతు కోశారు. అది రాజకీయమంటారా అని ఎద్దేవ చేశారు. మీరు రాజకీయాల్లో ఏం చేస్తారు, యువతకి ఏం చేస్తారు అది చెప్పండి ముందు. ఎవరో స్క్రిప్ట్ వాసి ఇచ్చేస్తే అది చదివేయడం సరి కాదు. వాస్తవమా, అవాస్తవమా అని నిజ నిజాలు తెలుసుకోని మాట్లాడండి అన్నారు. యువతకి మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు. యువతకి ముందు ప్రాముఖ్యత ఇవ్వండి ఏం చెప్పదల్చుకున్నారో చెప్పండి అంతేగాని వ్యక్తిగతంగా రెచ్చగొట్టి బురద జల్లోద్దన్నరు. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు కి దమ్ముంటే అభివృద్ధి ఏంటో మీరు ఏం చేయాలనుకున్నారో ప్రజలకు చెప్పండి. అంతేగాని వ్యక్తిగతంగా మా కుటుంబాన్ని, ప్రజలను రెచ్చగొట్టి అవమానల పాలవద్దన్నరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు, బీసీలకు పెద్ద పీట వేశారన్నారు.నేను మంత్రి కొడుకు అని ఏనాడు చెప్పుకోలేదు మాకు పదవి వ్యామోహం ఉండదని. ఈ పదవులు శాశ్వతం కాదని. ప్రజల ఆదరణ అభిమానమే శాశ్వతం మన్నరు. వైసీపీ ప్రభుత్వంలో తణుకు అభివృద్ధికి పది ఏళ్లలో తన తండ్రి ఎనలేని కృషి చేశారన్నారు. ప్రజల ఆదరణతోనే నా తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా, నేడు మంత్రిగా పనిచేస్తున్నారని ఇప్పుడు మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి తీరతారని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మీరు ఎమ్మెల్యే అవకుండానే పదవి వ్యామోహం మీకు ఉంది. భవిష్యత్తులో మీరు ఏమవుతారో నని ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఘాటైన విమర్శలు చేశారు.