PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫిర్యాదులను పరిశీలించి…. పరిష్కరిస్తాం

1 min read

–జగనన్నకు చెప్పుదాం.. స్పందన కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం

– కలెక్టర్ విజయరామరాజు

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు : మండలంలో వివిధ కారణాల వల్ల అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు జగనన్నకు చెపుదాం, స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు అన్నిటిని కూడా పరిశీలించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ విజయరామరాజు అన్నారు, బుధవారం స్థానిక  స్థానిక రెవిన్యూ కార్యాలయంలో కలెక్టర్ విజయరామరాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన జగనన్నకు చెబుదాం.. స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మండల ప్రజలు పాల్గొనడం జరిగింది, సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు అర్జీ ఆరుల సమస్యలు విని వారి సమస్యలను అక్కడికక్కడే జిల్లా అధికారులతో, మండల అధికారులతో మాట్లాడి పరిష్కరించే తగినవి అక్కడే పరిష్కరించి, పరిష్కారం కావలసిన వాటిని ఆయన త్వరగతిన పూర్తి అధికారులను ఆదేశించడం జరిగినది, ప్రజల సమస్యలను ఎంతో సానుకూలంగా సహనంగా విన్న ఆయన ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా అక్కడే ఉన్న అధికారులను ఆదేశించడం జరిగింది, ఉదయం 9:30 గంటల నుండి నుండి మధ్యాహ్నం12 గంటల వరకు ఆయన ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది, కొంతమంది రైతులు కేసీ కెనాల్ కు నీళ్లు ఇస్తే వరి పంట సాగు చేస్తామని తెలపడంతో, ఆయన స్పందిస్తూ, వర్షాభావం తక్కువగా ఉండడంతో వరి పంట వేసేందుకు డ్యాములలో నీటిమట్టం తక్కువగా ఉందని అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తెలిపారు, అలాగే వ్యవసాయ అధికారులను పిలిచి అన్ని రైతు భరోసా కేంద్రాలలో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలపడం జరిగింది, కనపర్తి జగనన్న లే అవుట్ లలో గ్రావెల్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని అక్కడ ఎంపీటీసీ రఘురాం రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకు రావడం జరిగింది, స్పందించిన ఆయన త్వరలోనే పనులు చేపడతామని ఎంపిటిసి కి హామీ ఇవ్వడం జరిగింది, గ్రామాలలో కరెంటు సమస్యలు లేకుండా చూడాలని, కొత్త రోడ్డు మీద నుండి, పాత రోడ్డు వరకు, అలాగే చెన్నూరు క్రాసింగ్ సాయిబాబా గుడి వద్ద నుండి, మసీదు వరకు మెయిన్ రోడ్డు వెంబడి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు ఆయన సూచించడం జరిగింది, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు, కొత్తగా ఇంటి స్థలాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆన్లైన్లో పేర్లు మార్పులు చేర్పులు, భూ సమస్యల పై వచ్చిన అర్జీలను ఆయన పరిశీలించి వెంటనే వీటికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని రెవిన్యూ సిబ్బందికి తెలిపారు.నేషనల్ హైవే సమస్యలపై ప్రజా ప్రతినిధులు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, ఎర్ర సాని మోహన్ రెడ్డి, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, లు ఎంపీటీసీలు, కలెక్టర్ కు వినతి పత్రం…… జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చెన్నూర్ కొత్త రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇండ్లు ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని అలాగే నేషనల్ హైవే అధికారులు జాతీయ రహదారి ఇరువైపులా నిర్లక్ష్యంగా ఉంచిన, సర్వీస్ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు, అలాగే కొత్త రోడ్డు పై నుండి పెట్రోల్ బంక్ వద్ద నుండి, చెన్నూరు పెన్నా నది వద్దకు డ్రైనేజీ పనులు, రోడ్డు పనులు చేపట్టాలని, కొత్త రోడ్డు పైన బస్ షెల్టర్ నిర్మించాలని అదేవిధంగా విద్యుత్ కి సంబంధించి 11 కె.వి లైన్ లు ఇండ్ల మీద నుండి తీయడం జరిగిందని, దీని ద్వారా అక్కడి ప్రజలకు ప్రమాదకరంగా మారిందని వాటిని వెంటనే మార్చేయాలని వారు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది, వెంటనే స్పందించిన ఆయన గురువారం కడపలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనికి సంబంధించి మండల ప్రజా ప్రతినిధులు మండలంలో జాతీయ రహదారికి సంబంధించిన ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి ఒక రెఫ రెండం తయారు చేసుకుని తీసుకురావాలని తెలిపారు, అక్కడ నేషనల్ హైవే పిడి గారితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు, చెన్నూరు కొత్త రోడ్డు వద్ద జాతీయ రహదారి ఇరువైపులా ఇల్లు ఇంటి స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఎలాంటి జీవోలు లేవని, అయితే నిజంగా ఎవరికైనా ఇంటి స్థలం లేకుంటే వారు 90 రోజుల లో ఇంటి స్థలం కింద రెవిన్యూ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుంటే వారికి ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు, జగనన్న కు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా చెన్నూరు మండల వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజలు 38 అర్జీలు ఇవ్వడం జరిగిందని కొన్నింటిని అక్కడే పరిష్కరించి, కొన్నింటిని త్వరగా తిన పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, స్పెషల్ కలెక్టర్ భరద్వాజ్, జడ్పీ సీఈఓ ఎం సుధాకర్ రెడ్డి, డి ఆర్ డి ఏ పి డి ఆనంద్ నాయక్, డ్వామా పిడి యదుభూషన్ రెడ్డి, డిపిఓ ప్రభాకర్ రెడ్డి, హౌసింగ్ పిడి కృష్ణయ్య, నియోజకవర్గ ప్రత్యేక అధికారి మల్లికార్జున రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి శారదమ్మ, జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

About Author