NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈద్గా ప్రాంగణం ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం

1 min read

– వైకాపా విభాగం అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షులు,ఈద్గా వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారి మహమ్మద్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సొంత నిధులతో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ల సహకారంతో వజు ఖన నిర్మాణం పనులు చివరి దశలో వున్నట్లు వైకాపా విభాగం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,ఈద్గా వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారీ మహమ్మద్ ఖాన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు గతంలో కూడా ఈద్గా ప్రహారీ గోడ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే గడికొట శ్రీకాంత్ రెడ్డి గారి చొరవతో ఎంపి సొంత నిధులను సుమారు2017-18,10లక్షల రూపాయలు, మరియు 2022 18లక్షలు కేటాయించడం జరిగింది.అదే విధంగా ఒక కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే,ఎంపి లను ప్రార్థనలకు వచ్చే వారి సౌకర్యార్థం ఈద్ గాహ్ కమిటీ కోరిక మెరుకు వజుఖన ను ఏర్పాటు చేయాలని వారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది,వెంటనే స్పందించిన ఎంపి నిర్మాణం కొరకు10 లక్షల రూపాయలను కేటాయించారన్నారు.ఈద్గా ప్రహారీ నిర్మాణం,వజు ఖన నిర్మాణం పనులకు కలిపి 38 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేశారన్నారు.ఈ నిర్మాణం పనులు కూడా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.ఈ రంజాన్ మాసంలో ప్రార్థనలకు వచ్చే ముస్లిం మైనార్టీలకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వం సిద్దం చేస్తున్నామన్నారు.

About Author