కేసీఆర్ తో కలుస్తాం.. స్పష్టం చేసిన ఉద్ధవ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశ హితం కోసం కేసీఆర్తో కలిసి పనిచేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తమతో కలిసి వచ్చే నేతలతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. దేశంలో విధాన పరమైన మార్పుల కోసం పోరాడుతామని తెలిపారు. దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.