నివేదిక ఇస్తేనే చర్చల్లో పాల్గొంటాం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశమయ్యారు. పీఆర్సీ నివేదిక ఇస్తేనే చర్చల్లో పాల్గొంటామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినట్టు సమాచారం. సమస్యలు చెబితేనే తెలుస్తాయని మంత్రి బుగ్గన అన్నారు. ఇప్పటి వరకు చెప్పాల్సింది చెప్పామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కార్యాచరణ ప్రకటించినందున ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని తెలిపారు. హెచ్ఆర్ఏ స్లాబ్ పై ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని, సమస్య పై సీఎం ఆలోచిస్తున్నారని స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రులు తెలిపారు. లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.