పటిష్ట ఓటర్ల జాబితాను రూపొందిస్తాం
1 min read
జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్
నంద్యాల, న్యూస్ నేడు: ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగించేందుకు నిర్వహణను మరింత పటిష్టం చేస్తామని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పటిష్టమైన ఎన్నికల జాబితా, నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, బీఎస్పీ తరఫున కొట్టంశ్రీనివాసులు, సిపిఎం తరపున కే శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ తరఫున రియాజ్ భాషా, వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున సాయిరాంరెడ్డి, జనసేన పార్టీ తరఫున రవికుమార్, ఎలక్షన్ సూపరిండెంట్ జయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచించిన ఆదేశాల మేరకు పటిష్టమైన ఓటర్ల జాబితా రూపొందించి ఎన్నికల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్న తీసుకుంటున్నట్లు తెలిపారు. గత సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకొని నిబంధనల మేరకు ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. రాజకీయ పార్టీలు బూతు ఏజెంట్లను తప్పనిసరిగా నియమించుకోవాలని జాయింట్ కలెక్టర్ పార్టీ ప్రతినిధులను సూచించారు. సిపిఎం పార్టీ తరఫున నర్సింహులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులతో పాటు డెత్ ఓటర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. జనసేన పార్టీ ప్రతినిధి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్ల స్లిప్పులలో పేర్లతో పాటు ఫోటో కూడా ఉంటే సులువుగా ఓటర్లు గుర్తించవచ్చని ఇందుకు తగు చర్యలు తీసుకోవాలని జెసిని కోరారు.