PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిత్రలిపి శాసనాలను పరిరక్షిస్తాం..

1 min read

– శ్రీశైలం ఆలయ ఈఓ రామారావు
పల్లెవెలుగువెబ్​, శ్రీశైలం: శ్రీశైలక్షేత్ర పరిధిలో ఇటీవల గుర్తించిన పురాతన శాసనాలను పరిరక్షిస్తామని ఆలయ ఈఓ రామారావు స్పష్టం చేశారు. రుద్రాక్షమఠానికి ఉత్తరం వైపున బండపరుపుపై (షీట్రాక్పై) , విభూతిమఠ ప్రాంతములో కూడా ఈ శాసనాలను గుర్తించామని, వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు . శనివారం కార్యనిర్వహణాధికారి స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రొఫెసర్ చంద్రశేఖరరెడ్డితో కలిసి ఈ శాసనాల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ( ఐ /సి) శ్రీనివాసరెడ్డి, సహాయ స్థపతి జవహర్లాల్. ఉద్యానవన అధికారి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రాచీన చిత్రలిపి శాసనాలు కలిగి ఉన్న ప్రదేశం చుట్టూ కంచెను (మెష్) ఏర్పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ను ఆదేశించారు. శాసనాలలోని విషయం అధ్యయనానికి అనుగుణంగా ఉండేందుకు ప్రయోగాత్మకంగా ఎస్టాంపేజ్​ పరిశీలనకు వీలుగా కాగితంపై వేయించామన్నారు. త్వరలో ఎపిగ్రఫీ నిపుణులతో ఈ శాసనాలకు సంబంధించి పలు అంశాల విశ్లేషణకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈఓ రామారావు వెల్లడించారు.

About Author