PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆది ఆంధ్ర పాఠశాలకు అన్ని వసతులు కల్పిస్తాం

1 min read

– ఎస్ ఎస్ ఏ జిల్లా కోఆర్డినేటర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు :కమలాపురం శాసన సభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు “SSA జిల్లా కోఆర్డినేటర్ అంబవారం ప్రభాకర్ రెడ్డి శుక్రవారం చెన్నూరు అరుంధతి నగర్ లోని ఆది ఆంధ్ర పాఠశాలను తనిఖీ చేశారు, అక్కడ విద్యార్థులకు కావలసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పద్మావతి విద్యార్థులకు సంబందింన వంట గది లేదని, అలాగే విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలం లేదని ఎస్ ఎస్ ఏ జిల్లా కోఆర్డినేటర్ అంబ వరం ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది, అదేవిధంగా పిల్లకు సంబదించిన ఆడిసనల్ రూమ్ లు లేవని ఆయనకు తెలియజేయడం జరిగింది, అదేవిధంగా అదే ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఉందని ఆ స్థలాన్ని పరిశీలించాల్సిందిగా ఆయనను విద్యార్థి కమిటీ చైర్మన్ కోరడం జరిగింది, ఆ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన ప్రభాకర్ రెడ్డి, స్థలం కు సంబంధించిన మీరు మీ గ్రామస్తులు మాట్లాడుకుని స్థలాన్ని పాఠశాలకు అప్పగించినట్లు అయితే వెంటనే ఎక్కడ అడిషనల్ రూము లకు, అలాగే ఆట స్థలానికి సంబంధించి నిధులు కేటాయించడం జరుగుతుందని ఆయన వారికి తెలియజేశారు అలాగే అరుంధతి నగర్ కి సంబంధించిన అంగన్వాడి స్కూల్ బాడుగ ఇంట్లోవున్న దని ఆయనకు తెలియజేశారు, ఆయన వెంటనే స్పందించి స్కూలుకు సంబంధించి స్థలాన్ని కేటాయిస్తే నాడు నేడు కింద స్కూల్ భవనానికి నిధులు కేటాయిస్తామని ఆయన వారికి తెలియజేశారు, ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి యువనాయకులు పెడబల్లే “ప్రదీప్ కుమార్ రెడ్డి” స్కూల్ కమిటీ చైర్మన్ పద్మావతి స్థానికులు, పాల్గొన్నారు.

About Author