PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యాయ సహాయం చేస్తాం.. సద్వినియోగం చేసుకోండి..

1 min read

–ప్రధాన న్యాయ మూర్తి : డాక్టర్ వి. ఆర్. కె. కృపా సాగర్
పల్లెవెలుగువెబ్​, కర్నూలు: ప్రజలకు న్యాయ సహాయం చేస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు. శనివారం కర్నూలు జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ ఆవరణంలో వృద్దులకు కంటి అద్దాలు మరియు చేతికర్రలు, చెవిటి మిషన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన డాక్టర్ వి. ఆర్. కె. కృపా సాగర్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 తేదీ వరకు కర్నూలు జిల్లా లోని ప్రతి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు, న్యాయ సేవలు గడప గడపకు వెళ్ళి ప్రజలకు చట్టాలను వివరించటం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎటువంటి కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న ఉచితంగా న్యాయ సహాయాన్ని అందజేయటం జరుగుతుందన్నారు. కావున జిల్లా లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అద్దాలు.. చెవిటి మిషన్లు పంపిణీ
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో కె.జి. గంగాధర రెడ్డి, యన్.జి.ఒ. సహకారంతో నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు – 31 పంపిణీ చేశారు. అనంతరం పి. విజయ, అసిస్టెంట్ డైరెక్టర్, డిఫ్ఫెరెంట్లీ ఎబుల్డ్ & డిసేబుల్డ్ పర్సన్స్, కర్నూలు వయో వృద్దులకు, దివ్యాంగులకు మరియు విభిన్న ప్రతిభావంతులకు టచ్ ఫోన్లు -2, చేతికర్రలు-5, చెవిటి మిషన్స్-10, వీల్ చైర్స్(wheel chairs)-2, మూడు చక్రాల వాహనాలు(try cycle)-2 మరియు గుర్తింపు కార్డులు – 4 పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్. వి.యన్. శ్రీనివాస రావు, శ్రీమతి పి.విజయ, అసిస్టెంట్ డైరెక్టర్, డిఫ్ఫెరెంట్లీ ఎబుల్డ్ & డిసేబుల్డ్ పర్సన్స్, కర్నూలు, శ్రీ కె.జి. గంగాధర రెడ్డి, యన్.జి.ఒ., కర్నూలు, వృద్దాశ్రమం లోని వృద్దులు, సీనియర్ సిటిజెన్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author