2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.30 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్విటర్ వేదికగా హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చెయ్యడం లేదని ఫేక్ ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఖాళీగా ఉన్నది 66,309 పోస్టులే అంటూ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పి జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.