నిరుపయోగంగా ఉన్న కళ్యాణ మండపాలను పునరుద్ధరిస్తాం
1 min read– టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి
– యాగంటిలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : మండలంలో రాయలసీమ జిల్లాలో నిరుపయోగం ఉన్న టీటీడీ కల్యాణ మండపాలను పునరుద్ధరించే ఒక మహత్తర కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టిందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి సొంత స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల నిర్మాణం వ్యయంతో నిర్మించతల పెట్టిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామభూపాలరెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, కర్నూల్ నగర మేయర్ బి వై రామయ్య, యర్డ్స్ చైర్మన్ కాటసాని ఉమామహేశ్వరరమ్మ, యాగంటి దేవస్థానం చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ,మాజీ చైర్మన్ దోనపాటి యాగంటిరెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఇదివరకు ఉన్న టిటిడి కళ్యాణ మండపాలను తిరిగి ఉపయోగంలోకి వచ్చేలా వాటిని మరమ్మతులు చేపడుతున్నామని అన్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న కళ్యాణమండపాన్ని త్వరలోనే టెండర్లు పిలిచి పునరుద్ధరణ చేపడతామని అన్నారు. అదే విధంగా హిందూ ధర్మ ప్రచారం కార్యక్రమంలో భాగంగా వెనకబడిన సామాజిక వర్గాలున్న గ్రామాల్లో దేవాలయాలను టిటిడి ఆధ్వర్యంలో నిర్మిస్తామని అన్నారు.. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. యాగంటిలో టీటీడీ కళ్యాణం మండపం కోసం పాణ్యం ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు ఎంతో వత్తిడి తీసుకవచ్చారని వారిచ్చిన మాట ప్రకారం రూ.3 కోట్ల నిధులు మంజూరు నిర్మాణం చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 30 ఏళ్ల చిరకాల కల నెరవేరిందిపాణ్యంఎమ్మెల్యేకాటసానిరామభూపాలరెడ్డిఎమ్మెల్యే కాటసాని రామభూపాలరెడ్డి మాట్లాడుతూ యాగంటి దేవస్థానంలో టీటీడీ కల్యాణనుండపం ఏర్పాటు తన 30 ఏళ్ల చిరకాల వాంఛ అని అది ఏ ఈరోజు నెరవేరడంపట్ల ఆనందంగాఉందనిఅన్నారు.ఆవేంకటేశ్వరస్వామి,యాగంటిస్వామి అనుగ్రహం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి సహకారంతోనే ఈ అసాధ్యం సుసాధ్యమైందని వారికి ధన్యవాదాలు తెలిపారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ యాగంటిలో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మండపం ఏర్పాటుచేయడం వలన పేదవారికి స్వామి సన్నిధిలో కళ్యాణము తక్కువ ఖర్చుతో జరుపుకొనే అవకాశం దక్కుతుందన్నారు. ఈ యేడాది కార్తీక పౌర్ణమి లక్షదీపోత్సవం కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.