అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మునిసిపల్ హాల్ నందు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించబడినది. ఇందులో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్ , అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.మురహరి నగర్ కి చెందిన శ్రీ వెంకటేశ్వర్లు తమ వీధి యందు రోడ్లు, డ్రైనేజీలు లేవని , అలాగే పందులు మరియు కుక్కల బెడద కూడా ఎక్కువగా ఉన్నదని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్యకి పరిష్కారం చూప వలసినదిగా కమీషనర్ ని కోరారు.లక్ష్మీపురం, మయూరి గ్రీన్ లాండ్స్ కి చెందిన శ్రీ. హుస్సైనప్పఇతరులు, తమ వీధి యందు త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యం, రోడ్డు రిపేరీలు జరగటం లేదని, దీని వలన కాలనీ వాసులందరూ తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించావలసినదిగా కమీషనర్ ని కోరారు.పెద్దపాడు, శ్రీ రామ రేసిడన్సి నివాసులైన శ్రీ అనజనేయులు ఇతరులు తమ వీధి యందు మునిసిపల్ వాటర్ కనెక్షన్, సి.సి.రోడ్డ్లు, వీధి లైట్లు లేవని అలాగే వ్యర్ధాలు తీసుకెళ్లటంలో కూడా జాప్యం జరుగుతున్నదని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించావలసినదిగా కమీషనర్ ని కోరారు.పాత కర్నూలు కి చెందిన శ్రీమతి అనీస్ ఖాతూన్ గారు గతంలో తనకు టిడ్కో గృహము కేటాయించియునారని , ప్రభుత్వ నిర్ణీత రుసుము కూడా తానూ చెల్లించి యున్నానని, కాని తన ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తానూ ఆ గృహము వద్దనుకున్తున్నానని, కావున తాన కట్టిన రుసుము వీలైనంత త్వరగా తమకు తిరిగి ఇప్పించావలసినదిగా కమీషనర్ ని కోరారు.విట్టల్ నగర్ కి చెందిన శ్రీ రమణ గారు మరియు ఇతరులు తమ వీధి యందున్న త్రాగు నీటి పైప్ లైను పగిలి పోవుట వలన దాని ద్వారా మురుగు నీరు కూడా కలిసి సరఫరా అవుతున్నదని, కావున వీలైనంత త్వరగా పగిలిన పైపు బాగుచేసి తమ ఆరోగ్యాలు కాపాడ వలసినదిగా కమీషనర్ని కోరారు. కృష్ణారెడ్డి నగర్ కి చెందిన శ్రీ గోపాల్ గారు మరియు ఇతరులు తమ వీధి యందు రోడ్లు మరియు కాలువలు వేయవలసినదిగా కమీషనర్ ని కోరారు. అశోక్ నగర్ కి చెందిన శ సురేష్ బాబు తమ వీధి యందు మురుగు నీటి కాలువ చాలా చిన్నదిగా ఉండి, వర్షము పడినప్పుడల్లా పూడుకొని పోయి ఇబ్బందికి గురి చేస్తున్నదని, కావున, క్రొత్త కాలువ నిర్మించవలసినదిగా కమీషనర్ ని కోరారుఈ రోజు సోమవారం స్పందన కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ. భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్ , , అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమతి శశిలత ,ఎం.హెచ్.వో. విశ్వేశ్వర రెడ్డి , శానిటరీ సూపర్‌వైజర్ నాగరాజుఆర్ ఐ మన్సూర్ బాషా , మేనేజర్ శ్రీ చిన్న రాముడు ,ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.