PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం….

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మునిసిపల్ హాల్ లో  సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించబడినది. ఇందులో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ. ఏ. భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్ , అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

1.       పార్ధసారధి నగర్ కి చెందిన శ్రీ మహబూబ్ బాష  ఇతరులు, తమ వీధి యందు మురుగు నీరు పోవుటకు సరియైన వ్యవస్థ లేనందున, దోమలు,  పందుల బెడద ఎక్కువగా ఉన్నదని ,  కావున ఈ సమస్యను  వీలైనంత త్వరగా పరిష్కరించావలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు.

2.       శ్రీ కృష్ణ  కాలనీ కి చెందిన శ్రీ మక్బూల్ అహమ్మద్ గారు మరియు ఇతరులు తమ కాలనీ యందు డ్రైనేజీ వ్యవస్థ లేదని, కావున తమ కాలనీ యందు డ్రైనేజీలు ఏర్పాటు చేయవలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు.

3.       సంతోష్ నగర్ కి చెందిన శ్రీ మౌలా గారు మరియు ఇతరులు, తమ వీధి యందు సరియైన రోడ్డు మరియు డ్రైనేజీ వ్యవస్థ లేదని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరించ వలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు.

4.       సీతారం నగర్ కి చెందిన శ్రీ నవీన్ కుమార్ గారు మరియు ఇతరులు, తమ వీధి యందు మురుగు నీరు పోవుటకు సరియైన వ్యవస్థ లేనందున, దోమలు మరియు డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉన్నదని,  కావున ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించావలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు.

5.       ఎఫ్.సి.ఐ కాలనీ కి చెందిన శ్రీమతి మెహమూద బేగం గారు మరియు ఇతరులు తమ వీధి యందు రోడ్డు పరిస్థితి సరిగా లేదని, కావున వీలైనంత త్వరగా  రోడ్డు రిపైరీ చేయించవలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు

6.       ఫోర్త్ క్లాసు ఎంప్లాయిస్ కాలనీ కి చెందిన శ్రీ రాజన్న  గారు మరియు ఇతరులు తమ కాలనీ నుండి శ్రీరామ నగర్ ని కలుపుతూ దారి ఏర్పాటు చేయవలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు

7.       పాత కర్నూలు కి చెందినా శ్రీమతి షబానా గారు, గతంలో తాము టిడ్కో ఇంటికోసము ప్రభుత్వ నిర్ణీత రుసుము కట్టియున్నామని, కాని తరువాత దశలలో తమ కేటాయింపు రద్దు చేయబడినదని, కావున గతములో తాము కట్టిన రుసుము తమకు తిరిగి ఇవ్వవలసినదిగా కమీషనర్ని అభ్యర్దించారు.ఈ రోజు సోమవారం స్పందన కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్  శ్రీ భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్  ఎస్.ఈ. శ్రీ. వేణుగోపాల్ , ఇంచార్జీ సిటీ ప్లానర్ శ్రీ మోహన్ కుమార్  , ఎం.హెచ్. వో. శ్రీ విశ్వేశ్వర రెడ్డి , సానిటరీ సూపర్వైజర్ శ్రీ నాగరాజు ,  మేనేజర్ శ్రీ చిన్నరాముడు  ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author