PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం..

1 min read

– జనరల్ మేనేజర్ ప్రభాకర్ రావు వెల్లడించారు.
పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె: మండలంలో నందవరం గ్రామంలో జిపిఐ కంపెనీ ప్రతినిధులతో కలిసి మండలంలోని నందవరం దేవస్థానంలో పొగాకు రైతుల ఆత్మీయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.ఆయన మాట్లాడుతూ ఇక్కడి పొగాకు రైతుల వ్యయ ప్రయాసాలను దృష్టిలో ఉంచుకొని పాణ్యం మండలంలోని కొనిదేడు గ్రామంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఈ సంవత్సరమే ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.పొగాకు రైతులు నష్టపోకూడదని ఉద్దేశంతో జిపిఐ కంపెనీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.బర్లీ పొగాకుతో ఈ ప్రాంత రైతులు మంచి దిగుబడులు సాధిస్తారన్నారు.రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో మరింతగా పొగాకు సాగు చేసేందుకు రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. రైతులు కూడా మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలన్నారు.ఏజీఎం వైఎస్ పాటిల్ మాట్లాడుతూ పొగాకు రైతులు కంపెనీ సూచించిన జాగ్రత్తలు పాటించి మంచి నాణ్యమైన దిగుబడులు సాధించి లాభాల బాటలో నడచాలన్నారు.బర్లీ పొగాకుకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.వచ్చే ఏడాదిలో మరింత ఎక్కువ స్థాయిలో పొగాకు సాగు విస్తీర్ణాన్ని పెంచుతామన్నారు.బర్లీ పొగాకు ఇంచార్జ్ రమేష్ రాజారావు మాట్లాడుతూ పొగాకు సాగు చేసిన రైతులకు నారు పోసినప్పటినుండి పంట చేతికొచ్చే వరకు దగ్గరుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిపిఐ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రావు,ఏజీఎం వైయస్ పాటిల్, పిఎం రమేష్ రాజ్, ఏరియా మేనేజర్ కోటేశ్వర రావుతో పాటు కంపెనీ సిబ్బంది పుల్లారెడ్డి,మల్లేష్, బాలు వివిధ గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author