స్వీకరించిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపుతాం
1 min read– మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయములోని ఓల్డ్ కౌన్సిల్ హాలు యందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో, ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తున్న మునిసిపల్ శాఖ అధికారులు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 1) చంద్రశేఖర్ నగర్ నివాసముంటున్న రామకృష్ణ మరియు కాలనీవాసులు వారి కాలనీకి మురుగునీరు పోవుటకు కాలువ నిర్మాణం, త్రాగునీటి సరఫరా కొరకు వాటర్ పైప్లైన్ మరియు సిసి రోడ్ వేయవలసినదిగా స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.2) వడ్డగేరిలో ఉన్న స్కందంకి షాపింగ్ మాల్ నందు నివాసితులైన విక్రమ్ కుమార మరియు ఓనర్స్ అందరూ తమకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని దానిని సత్వరమే పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.3) గవర్నమెంట్ ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ఒకటవ నంబర్ వార్డెన్ తమ హాస్టల్ నందు చదువుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువ అయినందున వలన నీటి సరఫరా కొరత ఏర్పడిందని దీనిని పరిష్కరించగలరని మీరు కమిషనర్కి అర్జీ ఇచ్చారు.4) వాసవి నగర్ నివాసతులైన ఎస్ వి మధు మరియు కాలనీవాసులు తమ ఏరియాకు రోడ్లు మరియు కాలువలు వేయవలసినదిగా స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
5) చల్లా స్ట్రీట్ లో నివాసం ఉంటున్న అబ్దుల్ సమద్ తమ ఏరియాలో మురికి కాలువలలో మురికి నీరు నిల్వఉంటున్నాయని దీనివలన అక్కడి ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
6) విట్టల్ నగర్ -2 నివాసం ఉంటున్న మెహబూబ్ భాషా గారు మరియు కాలనీవాసులు తమ ఏరియాకు రోడ్లు నిర్మించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
7) ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా ఉన్న కాంక్రీట్ బీమ్ను/వాటర్ వ్యాల్యూ ను మూసివేయాలని కోరుతూ బ్యాంక్ మేనేజర్ అర్జీ ఇచ్చారు.
8) ప్రజా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నరసింహులు తమకు అందవలసిన వెల్ఫేర్ స్కీమ్స్ సరిగ్గా అందటం లేదని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
9) ధర్మపేటలో నివాసం ఉంటున్న రాజుగారు పెన్షన్ నిలిపివేయబడినదని దానికి సరైన కారణములు మరియు పెన్షన్ను పునఃపరారంబించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
10) జోహాపురంలో నివాసముంటున్న శ్రీకాంత్ రాజబాబు తమ ఇంటి పన్ను ఎక్కువగా ఉన్నదని దీన్ని క్రాస్ వెరిఫై చేయాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి తక్షణ వీటిపై పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన కర్నూల్ మున్సిపల్ శాఖ కమిషనర్ ఐఏఎస్ భార్గవ్ తేజ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఎస్ ఈ వేణుగోపాల్ డిసిపి మోహన్ కుమార్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వర రావు, మేనేజర్ చిన్న రాముడు , ఇతర అధికారులు.