NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తాం..:ఎమ్మెల్యే శ్రీకాంత్​ రెడ్డి

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లాలో రైస్ మిల్లులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని అన్నమయ్య జిల్లా వైసిపి అధ్యక్షులు,ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు  ఆదివారం పట్టణంలోని మదనపల్లె రోడ్డులో గల పిసిఆర్ కన్వెన్షన్ హాల్లో అన్నమయ్య జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్లలకు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయని,వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.అలాగే అన్నమయ్య జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ సాదక్ అలీ గతంలో కూడా ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యక్షుడుగా కొనసాగి ఎక్కడ రైస్ మిల్లర్లకు సమస్యలు ఎదురైనా వెంటనే స్పందిస్తూ వారికి అండగా నిలిచాడన్నారు.అంతేగాక కౌన్సిలర్ గా ప్రతినిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాడని చెప్పారు.రైస్ మిల్లర్లకు ఎవరికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందిస్తూ రైస్ మిల్లర్ల యజమానులకు అండగా ఉండే సాదక్ అలీని అన్నమయ్య జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభపరిణామం అన్నారు.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని రాయచోటి,రాజంపేట,రైల్వేకోడూరు,పీలేరు తంబళ్లపల్లి,మదనపల్లి తదితర నియోజకవర్గాల నుండి వచ్చిన రైస్ మిల్లర్ల యజమానులు,అసోసియేషన్ సభ్యులు నూతన జిల్లా అధ్యక్షుడుగా సాదక్ అలీని ఏకగ్రీవంగా ఎన్నుకుని శాలువా,పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్ల యజమానులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు.ఈ కార్యక్రమంలో కడప జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కామేశ్వర్ రెడ్డి,ట్రెజరర్ ప్రసాద్ గుప్తా,తిరుపతి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ కుమార్,అన్నమయ్య జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామాంజనేయులు,వేణుగోపాల్,సెక్రటరీ కిరణ్ కుమార్,ట్రెజరర్ శ్రీనివాసులు,జాయింట్ సెక్రటరీలు కిషోర్ కుమార్,మనోహర్,శ్రీనివాసులు,రాయచోటి బంగారు షాపుల అసోసియేషన్ కార్యదర్శి ఇర్షాద్ అలీ ఖాన్,మున్సిపల్ కాంట్రాక్టర్ రియాజుర్ రెహమాన్,జిల్లాలోని పలు రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author