PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తాం…

1 min read

– జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: అన్ని గూడెలలోని గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు.  బుధవారం కలెక్టరేట్ లోని వైయస్సార్ సెంటినరీ హాలులో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కె. రాజు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ కె. బాలా నాయక్,  ప్రధాన కార్యదర్శి కే రవి నాయక్, వివిధ సంఘాల నాయకులు విక్రమ్ సింహ నాయక్, శంకర్ నాయక్, స్వామినాయక్, రవీంద్రనాయక్, జవహర్ నాయక్, శ్రీను నాయక్, గోపాల్, అశోక్ నాయక్, రామచంద్రుడు, సలోమీ, ఈశ్వర్, నారాయణమ్మ, నరసింహారావు, తోటరాముడు, రామ్ బాలాజీ నాయక్, డిఆర్ఓ పుల్లయ్య జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధ రావు, ఎటిడబ్ల్యుఓ హుస్సేనయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల కాలంలో శ్రీశైలంలో భారత రాష్ట్రపతి గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశలో చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే నెరవాడ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా రాష్ట్ర గవర్నర్ చెంచు విద్యార్థులతో ముచ్చటించి వారి బాగోగులు తీసుకొని చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారన్నారు. షెడ్యూల్ తెగల ప్రజల అభివృద్ధికి సంబంధించి జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. షెడ్యూల్ తెగల ప్రజలకు ఆసక్తి ఉన్న రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ నిప్పించి స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి విషయాలలో అన్ని సంఘాలు ఏకమై కోఆర్డినేషన్ తోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.చదువుతోనే తలరాత మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులు ఎంత బాగా చదివితే భవిష్యత్తు అంత బాగా మారుతుందన్నారు. బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, స్కూల్ కు రాని పిల్లలను గుర్తించి తిరిగి స్కూల్లలో చేర్పించాలని సంబందిత నాయకులను సూచించారు. ప్రభుత్వం స్కూల్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఒక మంచి ఉద్దేశమని దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసించడం వల్ల పిల్లలు భవిష్యత్తులో ఎంతో పైకి ఎదిగే అవకాశం ఉందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల గిరిజన నాయకులు వివిధ అంశాలపై సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు జిల్లా కలెక్టరును శాలువాతో సన్మానించారు.

About Author