ఓటర్ల సమస్యలను పరిష్కారిస్తాం
1 min read
కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ యస్.రవీంద్ర బాబు
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపే ఓటర్ల సమస్యలను పరిష్కరిస్తామని కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్రబాబు అన్నారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత నెల సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పురోగతిని సమావేశంలో ఆర్వో వివరించారు. వెంకటరమణ ఓటర్లు కిడ్స్ వరల్డ్ సమీపంలోని పోలింగ్ బూత్‌లో ఉన్నట్లు, ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేంద్రం లేదంటూ గత నెల సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించారని ఆర్వో చెప్పారు. దీనిపై తగు చర్యలు చేపట్టామని, జోహరపురం ఇందిరమ్మ కాలనీలో 969 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సమయంలో వారి కోసం అక్కడ ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వెంకటరమణ కాలనీ ఓటర్లకు పోలింగ్ కేంద్రం మార్పునకు దరఖాస్తులు ఇచ్చామని, తద్వారా వారికి సమీప పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆర్వో వెల్లడించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఆర్వో వెంకటలక్ష్మి, డిప్యూటీ ఎమ్మార్వో ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న, సినియర్ అసిస్టెంట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.