NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధైర్య పడకు అండగా ఉంటాం….

1 min read

పక్షవాతం సోకిన అభిమానిని పరామర్శించిన వైసీపీ నాయకులు రెడ్యం, సాయినాథ్ శర్మ

కమలాపురం, న్యూస్​ నేడు:  తమ అభిమానుడు ఆత్మీయతతో పలకరించే పెద్దచెప్పల్లి గ్రామం దళిత వాడకు చెందిన నామాల సుబ్బరాయుడు కు పక్షవాతం సోకడం తో  ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకొన్న వైసీపీ రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ శుక్రవారం సాయంత్రం నామాల సుబ్బరాయుడు గృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రాజకీయంగా స్నేహా పరంగా సుబ్బరాయుడు  ఆప్తుడు కావడం తో విషయాన్ని తెలుసు కున్న నాయకుకులు సాయినాథ్ శర్మ, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి సుబ్బరాయుడు కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనారోగ్యం కారణంగా ఆలోచన చేయవద్దని తాము అన్నింటికి అండగా ఉంటామన్నారు. ఈ మేరకు సుబ్బరాయుడు కుటుంబానికి కొంత మేర ఆర్ధిక సహాయం చేసారు. గ్రామానికి చెందిన అభిమానులు వైసిపి నాయకులు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు నాగరాజా చారి, మైనార్టీ నాయకులు గౌస్ లాజం మైనార్టీ మండల కన్వీనర్,మహమ్మద్ షుకూర్ , షేక్షావలి మహారాజ్ ,హాసన్ ,నామల రాజా,చంటి, చంద్రపాల్ ,సుబ్బన్న,సింహాద్రి, అప్పారావు పల్లె ,రవి యాదవ్,  ఆది ,యేసు రత్నం, గుండాల లక్ష్మయ్య, తదితరులు భారీసంఖ్య లో వారి వెంట ఉన్నారు.

About Author