మహా సిమెంట్ పర్యావరణ కాలుష్య ఉల్లంఘన పై చర్యలు తీసుకుంటాం
1 min read– జిల్లా పొల్యూషన్ బోర్డ్ ఈఈ మునిప్రతాప్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం ఎనకండ్ల వద్ద ఏర్పాటైన మహా సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టె చర్యలు తీసుకుంటామని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ మునిప్రతాప్ తెలిపారు. శనివారంబనగానపల్లె మండలం భానుముక్కల పరిధిలోని జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ లీజుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఈ ఈ మునిప్రతాప్ ను విలేకరులు మహా సిమెంట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా తీవ్ర కాలుష్యం ఏర్పడిందని మీడియాలో వచ్చిన వార్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన పై విధంగా సమాధానం చెప్పారు.మహా సిమెంట్స్ ప్యాక్టరీకి సంబంధించి రవాణాపరంగా జరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని, బనగానపల్లి రైల్వే స్టేషన్ వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ బొగ్గు,క్లిన్ట్ లోడింగ్,అన్ లోడింగ్ కారణంగా ప్రజలకు ఎదురవుతున్న పర్యావరణ కాలుష్య ఇబ్బందులను స్థానిక మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఆయన ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ అందచేయాలని కోరారు. అయితే మీడియాలో వచ్చిన వార్తలకు యాజమాన్యం ఖాతరు చేయడం లేదని, ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకవెళ్లినా అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం లేదని మీడియా వారు ఆయనకు చెప్పారు. సమస్య మీరు ఎవరు దృష్టికి తీసుకు వెళ్లారు ఆ వివరాలుచెప్పండి ఈసారిజరిగేప్రజాభిప్రాయసేకరణ సమావేశంలో తాము ఆ విషయాన్ని వారికి తెలిపి సమస్యపరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆ అధికారి తెలిపారు.