పేదలను ఆదుకుంటాం..
1 min read– ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కరోన విపత్కర కాలంలో ఉపాధి లేక ఎందరో పేదలు ఆర్థికంగా చితికిపోయారని, వారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తామని ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం అన్నారు. పెయింటింగ్ పని చేస్తానని, కరోన కర్ఫ్యూ కారణంగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాననిత, కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తి తన బాధను ఎన్డబ్ల్యూపీ హసీనాబేగం ఎదుట వాపోయాడు. గురువారం సదరు వ్యక్తి కూతురి వివాహం ఉండటంతో… హసీనాబేగం అక్కడికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. వధువుకు రూ.5వేలు ఆర్థిక సహాయం చేశారు. ఏదైనా సమస్య వస్తే.. పార్టీ కార్యాలయంలో కలవాలని, వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నేషనల్ జిల్లా మహిళ వింగ్ ప్రెసిడెంట్ ఎన్.మేరీ , పీఆర్ఓ సురేఖ , కర్నూల్ నేషనల్ ఉమెన్స్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.