PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టరేట్ సుందరీకరణ కు చర్యలు తీసుకుంటాం

1 min read

– కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కలెక్టరేట్ సుందరీకరణ కు చర్యలు తీసుకుంటామని, అదే విధంగా అన్ని శాఖల కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని డిఆర్ఓ, డ్వామా, వ్యవసాయ శాఖ, పశు సంవర్థక శాఖ, డిఆర్డిఎ, సిపిఓ, ఎలక్షన్ సెల్, జిల్లా పంచాయతీ కార్యాలయం, డ్వామా కార్యాలయాలతో పాటు సునయన ఆడిటోరియాన్ని మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, డిఆర్ఓ నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..భోజనం చేసిన ప్లేట్లు, కాఫీ కప్పులు కార్యాలయ పరిసరాల్లోనే పడేసి చెత్తా చెదారం తో అపరిశుభ్రంగా ఉన్నాయని,వెంటనే శుభ్రం చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. కార్యాలయాలను,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.. వ్యర్థాల నిర్వహణకు చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో పాతబడి,పనికిరాని వాహనాలను వెంటనే డిస్పోస్ చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.కారిడార్లలో వేలాడుతున్న విద్యుత్ తీగలను, ఇంటర్నెట్ వైర్లను ఒక పైప్ లైన్ లో అమర్చాలని కలెక్టర్ సూచించారు. భవనాలు మొత్తం వాటర్ ప్రూపింగ్ చేయిస్తామని, స్లాబ్స్ కూడా మరమ్మతులు చేయిస్తామన్నారు..అన్ని ఫ్లోర్లలో కారిడార్ లు మరమ్మతులు చేసి ఆధునీకరిస్తామన్నారు.. వాష్ రూమ్స్ మరమ్మతులు చేయించి బాగు చేస్తామని, ఆ తర్వాత వాటిని శుభ్రంగా నిర్వహణ చేసే బాధ్యత అధికారుల మీద ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. కారిడార్లు, రూముల్లో ముందు భాగాన పెయింటింగ్ చేయిస్తామన్నారు.. సునయన ఆడిటోరియంలో సీటింగ్,లైటింగ్ తదితర అంశాలకు సంబంధించి ఆధునీకరణ పనులను చేపడతామన్నారు..కార్యాలయ ఆవరణలో ల్యాండ్ స్కేపింగ్, పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.కలెక్టరేట్ లో ఉన్న కార్యాలయాల్లో టూ వీలర్లు, ఫోర్ వీలర్స్ ఎంత మందికి ఉన్నాయో వివరాలు సేకరించి, తదనుగుణంగా విడి విడిగా పార్కింగ్ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించారు.కలెక్టరేట్ లోపలకు వచ్చే ఆటోలను గేటు వద్దనే నియంత్రించేలా చర్యలు చేపట్టాలన్నారు.కలెక్టరేట్లో ఉన్న లిఫ్ట్ ను తయారు చేయించాలని, వికలాంగుల శాఖ కార్యాలయంలో ఉన్న ర్యాంపును బాగు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author