మిగిలివున్న ధాన్యాన్ని…కొనుగోలుకు చర్యలు చేపడతాం
1 min read
వి శ్రీలక్ష్మి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో ఖరీఫ్ లో మిగిలివున్న ధాన్యాన్ని ప్రభుత్వం వారిచే ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం ని కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి తెలిపారు. జిల్లాలో రభీ ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాక వాటితో పాటు జిల్లాలోని ఉన్న మిగిలిన ఖరీఫ్ ధాన్యాన్ని రభీ సీజన్లో కొనుగోలు కేంద్రం ద్వారా తీసుకోడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా లో ఖరీఫ్ సీజన్ కి సంబంధించి మొత్తం 3,50,843 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగు చేసి సిఎంఆర్ బియ్యం ను రైస్ మిల్స్ ద్వారా మొత్తం డెలివరి చేయడం జరిగిందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.