NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు నూటికి నూరుశాతం వినియోగిస్తాం…

1 min read

గత ప్రభుత్వంలో ఎస్సీ సంక్షేమానికి  రద్దు చేసిన  28 పథకాలను తిరిగి ప్రారంభిస్తాం

ఎన్డీఏ ప్రభుత్వంలో మాదిగల సంక్షేమానికి పూర్వ వైభవం తీసుకొస్తాము

ఏపి మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ డా.ఉండవల్లి శ్రీదేవి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :బుధవారం:స్థానిక యస్.సి కార్పొరేషన్ కార్యాలయంలో ఏపి మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఒక రూపాయి ఖర్చు చేయలేదని ఉన్న నిధులు పక్కదారి పట్టించారని అన్నారు.ఎన్డీఏ ప్రభుత్వంలో నూటికినూరుశాతం వినియోగించి,మాదిగల సంక్షేమానికి కృషి చేసి వారిజీవితాలలో వెలుగులు నింపటమే నా ప్రధమ కర్తవ్యం అని ఏపి మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు.దళితులకు నేను మేనమామను,నా ఎస్సీలు,నా ఎస్టీలు,నా బీసీలు అంటూ గత ప్రభుత్వ నేత దళితులను మోసం చేశారన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి నూరుశాతం కట్టుబడి ఉందని వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో కృషి చేస్తామని చెప్పారు.డాక్టరు బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా,చట్టబద్ధంగా దశాబ్దాల కాలం నుంచి ఎస్సీలు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్వయం ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు, అంబేద్కర్ విదేశీ విద్య వంటి 28 పథకాలను రద్దుచేసి, ఎస్సీ అభివృద్ధి సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు.గత ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన 28 పథకాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు స్పష్టం చేశారు.మాదిగ,మాల,రెల్లి కార్పొరేషన్‌కు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని,అభివృద్ధి సంక్షేమం చేసింది శూన్యం అన్నారు.అయిదు దళిత నియోజకవర్గం మధ్య ఏర్పాటు చేసిన ప్రజా రాజధానిని నిర్వీర్యం చేసి దళితుల అభివృద్ధిని విధ్వంసం చేశారని, రాజధాని పూర్తయి ఉంటే అత్యధికంగా లబ్ది పొందేది ఉపాధి పొందేది దళితులేనని ఆమె అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందజేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సర్వే పేరుతో లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించి దళితవాడల్లో ఉంటేనే ఉచిత విద్యుత్ అమలు అవుతుందని గత ప్రభుత్వం అవమానించిందని అన్నారు. దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు ఇచ్చిన 12 వేల ఎకరాల అసైన్ భూములను లాక్కుని వేలాది దళిత కుటుంబాలు రోడ్డున పడేశారని, దళితులను బెదిరించి ఆ భూముల్లో అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వుకుని దళితుల ద్రోహిగా గత పాలకులు చరిత్ర హీనులుగా నిలిచిపోయారని అన్నారు.దళిత యువకులు వ్యాపార,పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు దోహదపడే ఎస్సీ కార్పొరేషన్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారని, ఎస్సీలకు మూడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి,ప్రభుత్వ సలహా దారులకు ఏడాదికి చెల్లించిన వేతనంలో సగం కూడా వీరికి ఖర్చు చేయలేదన్నారు.మెరిట్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయవలసిన మెడికల్ కాలేజ్ సీట్లను కూడా అమ్ముకుంటూ దళితులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.17 మెడికల్ కాలేజీల ద్వారా దళిత బిడ్డలకు దక్కాల్సిన 544 మెడికల్ సీట్లను కూడా అమ్ముకుని దళితులను డాక్టర్లు కాకుండా గత ప్రభుత్వ అధినేత అడ్డుపడ్డారన్నారు.గత ప్రభుత్వంలో ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, విదేశీ విద్యను ఆక్షలతో ఆటకెక్కించటం, ఫీజు రీయింబర్స్మెంటు చెల్లింపులు జాప్యం చేసి దళితులకు విద్యను దూరం చేశారని అన్నారు. ఏ,బి,సి,డి వర్గీకరణ చేసి ఎన్నో ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు.ఉభయ జిల్లాలకు తొలివిడతగా 1740 యూనిట్లకు గాను రూ 58.60 కోట్లు మంజూరు అయ్యాయని, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని పారదర్శంగా మంజూరు చేయటం జరుగుతుందని దళారులను నమ్మి మోసపోవద్దని ఆమె అన్నారు. టిడిపి అంటేనే మాదిగల ప్రభుత్వమని రానున్న కాలంలో సంక్షేమం,అభివృద్ధి పూర్వ వైభవం తీసుకొస్తామని చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సొసైటీ కార్యనిర్వాహక సంచాలకులు యం.ముక్కంటి, నాయకులు పొలిమేర హరికృష్ణ, మార్లపూడి పాల్ రాజు,బయ్యారపు రాజేశ్వర రావు, కొమ్ముల రాజేష్,జుంజి మోజెస్, శ్రీరామరమేష్, మహిళా నాయకులు, జిల్లా ఎస్సీ సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *