PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తాం

1 min read

– శ్రీ నంది కళాశాల సహకారంతో గర్భిణీలకు అన్నదాన కార్యక్రమం..
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం నందు శ్రీ నంది జూనియర్ కాలేజ్ యాజమాన్యం సహాకారంతో జవ్వాజి సుంకన్న‌‌‌ గౌడ్ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గర్భిణి స్త్రీలకు, రోగులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించారు. ప్రతి నెల 9వ తారీఖున నిర్వహిస్తూన్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణి స్త్రీలకు, రోగులకు అన్నదానం చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. డాక్టర్ రాయుడు నేతృత్వంలో వైద్యులు మెరుగైన చికిత్స లు అందిస్తున్నారన్నారు. ప్రతి నెల 9వ తేదీన గర్భిణి స్త్రీలు దాదాపు 200 మందికి పైగా చికిత్స కోసం ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారంటే నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రం అరుదైన ఘనతను పొందిందన్నారు.డా.రాయుడు మాట్లాడుతూ నందికొట్కూరు ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రి నుంచి 50 పడకల హాస్పిటల్ కు ప్రభుత్వ అనుమతి పొందేందుకు సహాకారం అందించాలని కోరారు.చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ద్వారా ఉన్నతాధికారులతో చర్చించి సహకారం అందిస్తామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం హాస్పిటల్ కు కావలసిన పరికరాలు అందే విధంగా అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఇలాంటి గొప్ప సేవలు అందించే వైద్యులు మన పట్టణంలో ఉండడం అదృష్టం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి సుంకన్న‌‌‌ గౌడ్ సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ , శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్ , శ్లోకా విద్యా సంస్థల చైర్మన్ సూదిరెడ్డి శ్రీధర్ రెడ్డి , నవనంది స్కూల్ కరస్పాండెంట్ బద్దుల శ్రీధర్, కిరాణం మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన్సూర్ , కౌన్సిలర్ లాలు ప్రసాద్ , ముస్లిం మైనారిటీ తాలుకా అధ్యక్షులు అబూబక్కర్ , మధు యాదవ్ , వ్యాయామ ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి , చల్లా శివారెడ్డి , శివ శంకర్ , బాండ్స్ శ్రీను, శ్రీ నంది జూనియర్ కాలేజ్ స్టాఫ్, వైద్య సిబ్బంది తదీతరులు పాల్గొన్నారు.

About Author