అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తాం !
1 min readపల్లెవెలుగు వెబ్: ఆప్ఘన్ సంక్షోభానికి పరిష్కారం చూపడానికి అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇందు కోసం రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఆప్ఘన్ పౌరులతో నిండిపోయిన కాబూల్ విమానాశ్రయంలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 1,615 మంది బ్రిటన్ పౌరులను ఆఫ్ఘన్ నుంచి బ్రిటన్ కు తరలించినట్టు తెలిపారు. ఆప్ఘన్ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమెనిక్ రాబ్ తీవ్రంగా విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. తాలిబన్ల పాలనను అనేక దేశాలు గుర్తించడానికి వెనుకాడుతుంటే.. బోరిస్ జాన్సన్ వారితో కలిసి పనిచేస్తామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు చైనా, రష్యా మాత్రమే ఆఫ్ఘనిస్థాన్ కు మద్దతుగా నిలవగా.. మిగిలిన దేశాలు తాలిబన్లను గుర్తించడానికి వెనుకంజ వేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇండియా ఒకే రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.