PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తమ సంపద పై ట్యాక్స్ వసూలు చేయండంటున్న ధనవంతులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రపంచ ధనవంతులు కొందరు తమ సంపద పై పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వార ఆర్థిక అసమానతలు తగ్గించాలని కోరుతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్ నుంచి ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ‘‘ప్రపంచం గత రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కానీ, మహమ్మారి సమయంలోనూ మా సంపద గణనీయంగా పెరిగిందని చెప్పగలం. పన్నుల్లో మా న్యాయమైన వాటాను చెల్లించగలమని మేం చెప్పగలం’’ అని ఆ లేఖలో ప్రపంచ సంపన్నులు పేర్కొన్నారు.గ్రూపు సభ్యుల్లో డిస్నీ వారసురాలు అబిగెయిల్ డిస్నీ, ఆమె సోదరుడు టిమ్ డిస్నీ, అమెజాన్ గత ఇన్వెస్టర్ అయిన నిక్ హనౌర్ కూడా ఉన్నారు. ఈ లేఖపై యూఎస్, యూకే, కెనడా, జర్మనీ తదితర 9 దేశాలకు చెందిన వారు సంతకం చేశారు.

           

About Author