ఉంగరం ధరిస్తే దోమలు దూరమట !
1 min readపల్లెవెలుగువెబ్: ఒక ఉంగరం ధరిస్తే దోమలు మనకు దూరమైతాయట. జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ హలే-విటెన్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు ఇలాంటిదే ఒక ఉంగరాన్ని త్రీడీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. కీటకాలను దూరంగా ఉంచే ఐఆర్3535 అనే ఒక పదార్థాన్ని దీనిలో వినియోగించారు. తమ పరిశోధన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాసుటిక్స్‌లో ప్రచురించారు. బయోడీగ్రేడబుల్ పాలిమర్‌తో ఐఆర్3535ను చుట్టి, ప్రత్యేక త్రీడీ సాంకేతికను వినియోగించి ఉంగరాన్ని ముద్రించారు. ఉంగరం కీటకాలపై ఎంతసేపు ప్రభావం చూపిస్తుందన్నది ఆయా ప్రాంతాల స్వభావం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. తమ పరిశోధన కేవలం తొలి అడుగు మాత్రమేనని, మరిన్ని ప్రయోగాలను చేయాల్సిన ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు.