NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హిళ లోదుస్తుల్ని మాస్క్ గా ధ‌రించి.. విమానం ఎక్కి… !

1 min read
                                  

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాకు చెందిన ఓ వ్య‌క్తి మ‌హిళ లోదుస్తుల్ని మాస్కుగా ధ‌రించాడు. విమానం బ‌య‌లుదేరే స‌మ‌యంలో త‌న సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. ఇది గ‌మ‌నించిన సిబ్బంది దాన్ని తొలగించి మాస్కు ధ‌రించాల‌ని కోర‌గా.. ఓ ఆడ‌మ్ జేస్ అనే ప్ర‌యాణీకుడు నిరాక‌రించాడు. దీంతో సిబ్బంది అత‌డిని విమానంలో నుంచి దింపేశారు. ఆడ‌మ్ జేస్ పై ఎయిర్ లైన్స్ చర్య‌లు తీసుకుంది. మాస్కు నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు నిషేధం విధించింది. దీనిపై ఆడ‌మ్ స్పందిస్తూ విమానంలో తినేటప్పుడు, తాగేట‌ప్పుడు కూడ మాస్కు ధ‌రించాల‌ని సూచిస్తున్నార‌ని, దీనికి నిర‌స‌న‌గా మ‌హిళ‌ల లోదుస్తుల్ని మాస్కుగా ధ‌రించాన‌ని తెలిపారు.

                           

About Author