పెళ్లి ఊరేగింపు .. 100 మంది పోలీసుల రక్షణ !
1 min readపల్లెవెలుగువెబ్ : మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి ఊరేగింపు వంద మంది పోలీసుల రక్షణలో సాగింది. నీముచ్ జిల్లా సర్సి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపు కోసం పోలీసులను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందన్న దానిపై దళిత పెళ్లికొడుకు రాహుల్ మేఘవాల్ మాట్లాడుతూ.. తాను పెళ్లి ఊరేగింపు నిర్వహించినా, గుర్రమెక్కినా ఏడాదిలోపు గ్రామం విడిచి వెళ్లాల్సి ఉంటుందని తమను హెచ్చరించారని పేర్కొన్నాడు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించాడు. పోలీసులు, అధికారులు వచ్చి తమ ఊరేగింపునకు రక్షణ కల్పించినట్టు చెప్పాడు. గూండాల నుంచి హెచ్చరికలు వచ్చిన తర్వాత వరుడి తండ్రి ఫకీర్‌చంద్ మేఘవాల్.. కలెక్టర్‌కు లేఖ రాస్తూ తన కుమారుడి వివాహానికి రక్షణ కల్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.