PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెడ్ కానిస్టేబుల్ కు వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కర్నూలు ఒకటవ పట్టణ పోలీసు హెడ్ కానిస్టేబుల్ జె. ఎమ్ డి రఫీ కి వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రం అందజేసిన… జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు.కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జె. ఎమ్ డి రఫీ ( హెచ్ సి – 1430 ) ను వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు ఎంపిక చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు బుధవారం ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో బాధితులు పొగొట్టుకున్న 128 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంతో పాటు , మత పెద్దలతో శాంతి యుత సమావేశాలను ఏర్పాటు చేయించడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు హెడ్ కానిస్టేబుల్ రఫీ ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ ను గుర్తించి , ప్రోత్సాహకంగా అవార్డులను అందజేస్తే వారిలో మరింత ఉత్సాహం పెరిగి, ఇంకా నిబద్ధతతో విధులు నిర్వహిస్తారని, వారిని మరింత చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశ్యంతో జిల్లాలో వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసా పత్రాలను పోలీసు సిబ్బందికి అందజేస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. పోలీసు సిబ్బందిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఇలాంటి అవార్డుల ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సంధర్బంగా ప్రశంసా పత్రం అందుకున్న కర్నూలు ఒకటవ పట్టణ హెడ్ కానిస్టేబుల్ జె.ఎమ్. డి రఫీ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ జేశారు.

About Author