PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీ చేతులమీదుగా వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: ఆదోని ఒకటవ పట్టణ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కు వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రం అందజేసిన… జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు.ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ MC మద్ది లేటి ( హెచ్ సి – 2650 ) ను వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు ఎంపిక చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు మంగళవారం ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. నవంబరు 12 వ తేదీన జరగబోయే జాతీయ లోక్‌ అదాలత్‌ లో కక్షిదారులైన ఇరుపక్షాలకు కౌన్సెలింగ్‌ చేసి , ఇరు పక్షాలను రాజీ చేయడంలో మెగా లోక్ అదాలత్ ద్వారా ఆదోని ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లోని 25 కేసులను పరిష్కారం చేయడంలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు హెడ్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. పోలీసు సిబ్బందిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఇలాంటి అవార్డుల ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సంధర్బంగా ప్రశంసా పత్రం అందుకున్న ఆదోని ఒకటవ పట్టణ హెడ్ కానిస్టేబుల్ MC మద్దిలేటి జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ జేశారు. విధి నిర్వహణలో ప్రతిభ ను గుర్తించి , ప్రోత్సాహకంగా అవార్డులను అందజేస్తే వారిలో మరింత ఉత్సాహం పెరిగి, ఇంకా నిబద్ధతతో విధులు నిర్వహిస్తారని, వారిని మరింత చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశ్యంతో జిల్లాలో వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసా పత్రాలను పోలీసు సిబ్బందికి అందజేస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

About Author