ప్రభుత్వానికి ..ప్రజలకు వారాది వార్తాపత్రికలు..
1 min readజర్నలిస్టుల సేవలు అభినందనీయం
భవిష్యత్తులో జాతీయ వాణి దినపత్రిక మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షస్తున్న..
జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ రావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సుమారు 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వివిధ జాతీయ, ప్రాంతీయ దినపత్రికలలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు మన్యం వీర్రాజు జాతీయ వాణి తెలుగు దినపత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. జాతీయవాణి 2024 సంక్రాంతి ప్రత్యేకసంచికను విడుదల చేశారు. ఆ సంచికను ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు శనివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు మరియు పార్టీ నాయకులు సమక్షంలో ఆవిష్కరించారు. వార్తాపత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తాయని, నేటి ఆధునిక యుగంలో పత్రికల ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని, జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వార్తలు సేకరించి ప్రచురించాలన్నారు. వార్తలు సేకరించే విషయంలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారి సేవలు అభినందనీయమన్నారు. వారికి బాసటగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తమ పార్టీ అధినాయకుడు కూడా పత్రిక నడపడం సంతోషదాయకమన్నారు. ఈ ప్రత్యేక సంచికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు సంక్రాంతి శుభాకాంక్షలు.