పోలీసులకు వీక్లీ ఆఫ్ లు.. నేటి నుంచే అమలు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : పోలీస్ సిబ్బందికి నేటి నుంచే వీక్లీ ఆఫ్ లు అమలు చేయండి అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలిచ్చారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 21న పోలీసు అమవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. అక్టోబర్ 21 నుంచే వీక్లీ ఆఫ్ అమలవుతుందని ప్రకటించారు. కానీ సీఎం ప్రకటన ఆచరణ రూపందాల్చలేదు. ఈ నేపథ్యంలో పోలీసు కుటుంబాల్లో తీవ్ర అసహనం వ్యక్తమయింది. విషయం గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్చలు చేపట్టింది. నేటి నుంచే వీక్లీ ఆఫ్ లు అమలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై పోలీసు కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.