ఎంపీఈఓ లకు భూసార పరీక్షల వారోత్సవాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోవ్యవసాయ శాఖ కమిషనర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు బనగానపల్లి మండలం లోని అన్ని ఆర్ బి కే కేంద్రాల ఇన్చార్జిలకు మరియు ఎంపీఈఓ లకు భూసార పరీక్షల వారోత్సవాలుకార్యక్రమంలో భాగంగా తిమ్మాపురం గ్రామ ఆర్బికే పరిధిలో మట్టి పరీక్ష నమూనాల సేకరణ పై అవగాహన మరియు మట్టి పరీక్షల వల్ల రైతులకు కలిగే లాభాలు మరియు పంట పొలాలు బాగుపరచుకునే అవకాశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఇందులో అన్ని ఆర్ బి కి ఇంచార్జిలు వ్యవసాయ విస్తరణ అధికారి పాల్గొన్నారు. ఈరోజు నుంచి ప్రతి ఆర్ బి కే నందు 20 శాంపులు మట్టి పరీక్షలు సేకరించి నంద్యాల మట్టి పరీక్ష పరిశీలన కేంద్రానికి పంపడం జరుగుతుంది.