PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చల్లా శ్రీ లక్ష్మీకి ఘన స్వాగతం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం  అవుకు మండలం పిక్కిళ్లపల్లి తండాలో గ్రామస్తుల పిలుపు మేరకు వారి సమస్యలను పరిష్కారం చేసే దిశగా చల్లా శ్రీ లక్ష్మీ భగీరథ రెడ్డి గారు అడుగులు.గ్రామస్తులు మన లెజెండ్ కి ఘన స్వాగతం పలికారు.గ్రామంలో పలు రకాల సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు చెప్పారు. త్రాగునీటి సమస్య వేధిస్తుందని చెప్పారు. నిర్మాణంలో ఉన్న దేవాలయం అకస్మాత్తుగా ఆగిపోయింది, పునర్నిర్మాణం కొరకు నిధులు ఇమ్మని కోరారు.మన చల్లా శ్రీ లక్ష్మి గారు సిసి రోడ్లు వేయించి,మినరల్ వాటర్ ప్లాంట్ త్వరలోనే వేయిస్తామని హామీ ఇచ్చారు.మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీ సహకారం కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న కూడా మీరు నాకు ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్పవచ్చు, మేము వెంటనే స్పందిస్తామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో చల్లా శ్రీ లక్ష్మీ భగీరథరెడ్డి అనుచరులు చల్లా చైతన్య రెడ్డి, చల్లా విక్రాంత్ రెడ్డి,చల్లా చైతన్య రెడ్డి గ చల్లా కార్యకర్తలు, చల్లా టీమ్ తదితరులుపాల్గొన్నారు.

About Author